కుంభమేళాలో అమిత్‌ షా పుణ్యస్నానం

Thu,February 14, 2019 12:31 PM

Amit Shah and Yogi Adityanath Take Holy Dip At Kumbh Mela

లక్నో : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం కుంభమేళాను సందర్శించారు. ఈ సందర్భంగా గంగ, యమునా, సరస్వతి నదులు కలిసే సంగం వద్ద అమిత్‌ షా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అమిత్‌ షా ప్రత్యేక పూజలు చేసి నదికి హారతి ఇచ్చారు. అమిత్‌ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మరికొందరు బీజేపీ నేతలు, సాధువులు కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. జునా అఖాడా ఆశ్రమంలో ఆచార్య మహామండలేశ్వర్‌ అవదేశానంద్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి అమిత్‌ షా సహపంక్తి భోజనాలు చేశారు.906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles