దోవ‌ల్‌తో షా అత్య‌వ‌స‌ర భేటీ

Mon,August 19, 2019 03:02 PM

Amit Shah Meets National Security Advisor, Intelligence Bureau Chief On J&K

హైద‌రాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఢిల్లీలో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ దోవ‌ల్‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. హోంశాఖ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబాతో పాటు ఇత‌ర సీనియ‌ర్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్లు కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. క‌శ్మీర్ అంశంపై చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో క‌శ్మీర్‌కు ఉన్న ప్ర‌త్యేక హోదా ర‌ద్దు అయ్యింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌త కొన్ని రోజులుగా క‌శ్మీర్‌లోనే దోవ‌ల్ ప‌హారా కాశారు.

3045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles