సూపర్.. ఇలా చేస్తే ప్రజల్లో కొంతైనా మార్పు వస్తుంది.. వైరల్ వీడియో

Wed,June 19, 2019 01:50 PM

ఈరోజుల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైనది ఆహార వృథా. పండించిన ఆహారంలో సగానికి పైగా వృథా అవుతోంది. పండించేవాడికే ఆహారం విలువ తెలుసు అన్నట్టుగా.. తినేవాడికి దాని విలువ తెలియదు. అందుకే.. ప్లేట్‌లో ఉన్న ఆహారంలో సగం కూడా తినకుండానే చెత్తకుప్పలో పడేస్తుంటారు చాలామంది. అటువంటి వాళ్లకు నిజంగానే దాని విలువ తెలియదు.


అవును.. నిజంగానే వాళ్లకు దాని విలువ తెలియదు. అన్నం విలువ తెలిసిన వాళ్లు ఎవరు కూడా ప్లేట్‌లో మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. ఒక్క మెతుకు పండించాలన్నా ఎంత కష్టపడాలో వాళ్లకే తెలుసు. ముఖ్యంగా ఫుడ్‌ను హోటళ్లలో, ఫంక్షన్లలో తెగ వేస్ట్ చేస్తుంటారు. ఫంక్షన్లలో అయితే వండిన దాంట్లో 50 శాతం కంటే ఎక్కువ వృథాగా పడేయడమే. హోటళ్లలో కూడా అంతే. ఇష్టమున్నట్లు ఆర్డర్ ఇస్తారు.. సగం తిని మిగితాది అందులోనే వదిలేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని వృథా చేయొద్దు.. అంటూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. మనకు ఎక్కవు. అన్నాన్ని వృథా చేయడం ఈరోజుల్లో ఫ్యాషన్ కూడా.

అవును.. ఫంక్షన్లలో మీరు చూస్తూనే ఉంటారు.. కొందరు ప్లేట్ నిండా పెట్టించుకొని.. రెండు బుక్కలు తిని మిగితాది డస్ట్ బిన్‌లో పడేస్తారు. అదో ఫ్యాషన్ వాళ్లకు. సరే.. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ఒకచోట ఫంక్షన్ జరుగుతోంది. అందరూ భోంచేస్తున్నారు. ఓ వ్యక్తి మాత్రం వెళ్లి డస్ట్ బిన్స్ దగ్గర నిలుచుకున్నాడు.

కొందరు టకటకా తినేసి తమ ప్లేట్‌ను డస్ట్ బిన్‌లో పడేయడానికి వచ్చారు. వాళ్ల ప్లేట్‌ను చూసిన ఆ వ్యక్తి అందులో ఉన్న మొత్తం ఆహారాన్ని తింటేనే ప్లేట్ డస్ట్ బిన్‌లో వేయాలి.. లేకపోతే కుదరదు.. అని వాళ్ల ప్లేట్‌లను డస్ట్ బిన్స్‌లో పడేయనీయలేదు. అందరికీ అదే పరిస్థితి. దీంతో చేసేదేం లేక.. పెట్టుకున్న ఫుడ్ అంతా గొంతులోకి వచ్చేదాకా తిని.. ప్లేట్‌ను ఊడ్చేసి అప్పుడు అందులో పడేశారు. ఈయన ఎవర్రా బాబు.. తిండితో చంపేలా ఉన్నాడే అంటూ గులుగుతూ వెళ్లిపోయారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles