నా పాస్‌పోర్టును నా మనవడికి దొరక్కుండా దాయాలి: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Wed,February 13, 2019 05:46 PM

Anand Mahindra tweet on passport photo with drawings goes viral

ఆనంద్ మహీంద్రా.. బిజినెస్ టైకూన్, మహీంద్రా కంపెనీ చైర్మన్. అంతేనా కాదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు ఫన్నీ ట్వీట్లు చేస్తుంటారు. వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో అప్పుడప్పుడు ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తుంటారు. ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. తాజాగా మరో ట్వీట్ చేశారు.

2014లో చైనాలో ఓ చిన్నారి తన తండ్రి పాస్‌పోర్ట్‌పై పెన్నుతో పిచ్చి గీతాలు గీశాడు. అప్పట్లో ఆ స్టోరీ, ఫోటోలు బాగా వైరలయ్యాయి. ఆ చిన్నారి కూడా తన తండ్రికి సారీ చెబుతున్నట్టుగా ఉన్న ఫోటో కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. అయితే.. దాన్ని ఇప్పుడు అందరూ గాలివార్త అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా.. చిన్నపిల్లలకు పాస్‌పోర్టులాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను దూరంగా ఉంచాలని అది మనకు గుర్తుకు తెస్తుంది. దాన్నే ఆనంద్ మహీంద్రా మళ్లీ ఓసారి గుర్తుకు తెచ్చారు.పిల్లాడు డ్యామేజ్ చేసిన పాస్‌పోర్టు ఫోటోను షేర్ చేసి.. నా మనవడికి నా పాస్‌పోర్టును అందకుండా పెట్టాలి. లేకపోతే నా పాస్‌పోర్టుకు కూడా ఇదే గతి పడుతుందేమో.. నా మనవడు ఆ పిల్లాడిలా క్ష‌మాప‌ణ‌లు చెప్పడు.. అంటూ ట్వీట్ చేశారు. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? ఆనంద్ చేసిన ట్వీట్‌పై వాళ్లు కూడా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

సార్.. మీరేమీ టెన్షన్ పడకండి. పాస్‌పోర్ట్‌ను మందంగా ఉండే ప్లాస్టిక్ షీట్‌తో తయారు చేస్తారు. ఈ ఫోటో కూడా ఫేక్.. అని ఒకరు... సార్ అది ఫేక్ స్టోరీ.. మీ పాస్‌పోర్ట్ సేఫే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

7434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles