నేను చనిపోయినట్టుగా చూపిస్తోంది:అంజుబాల

Wed,March 9, 2016 07:48 PM

Anju Bala says Wikipedia showed her as dead


న్యూఢిల్లీ: వికీపీడియాలో తాను చనిపోయినట్టుగా ఉందని బీజేపీ ఎంపీ అంజు బాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ మార్చి 3న తాను చనిపోయినట్టుగా వికీపీడియాలో పొందుపరచబడి ఉందని..ఈ విషయంపై తన కార్యదర్శికి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అంజు బాల మాటలపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అంశాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇది చాలా తీవ్రమైన అంశమని..ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

1535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles