బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త దారుణ హత్య

Wed,June 12, 2019 01:34 PM

Another BJP worker Anil Singh murdered in West Bengal

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక వాతావరణం కొనసాగుతూనే ఉంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం ఇప్పటి వరకు 8 మందిని బలిగొంది. మల్దాలో తాజాగా ఇవాళ మరో బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. మృతుడిని ఇంగ్లీష్ బజార్‌కు చెందిన అనిల్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని దుండగులు తగులబెట్టారు. అనిల్ సింగ్ కొద్ది రోజుల క్రితం అదృశ్యమైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తృణమూల్ గుండాలే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ కార్యకర్తల హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles