ద్వైపాక్షిక చ‌ర్చ‌లే.. జైశంక‌ర్ ట్వీట్‌

Fri,August 2, 2019 01:23 PM

Any discussion on Kashmir only bilaterally, with Pakistan, MEA tells Pompeo

హైద‌రాబాద్‌: క‌శ్మీర్ అంశం గురించి పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చ‌ర్చ‌లే ఉంటాయ‌ని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంక‌ర్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌యాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియోకు వెల్ల‌డించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. థాయిలాండ్‌లో జ‌రుగుతున్న‌ ఏషియాన్ 2019 స‌ద‌స్సులో ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. ఈ నేప‌థ్యంలో జైశంక‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో క‌శ్మీర్ అంశం గురించి స్ప‌ష్టం చేశారు. పాక్‌తో క‌శ్మీర్ స‌మ‌స్య గురించి చ‌ర్చించేందుకు తాను మ‌ధ్య‌వ‌ర్తిగా ఉంటాన‌ని ఇటీవ‌ల అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పిన నేప‌థ్యంలో భార‌త్ ఈ క్లారిటీ ఇవ్వాల్సి వ‌చ్చింది.

491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles