ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాకు అవమానం

Sun,February 10, 2019 10:32 AM

AP BJP Chief Kanna Laxminarayana Fire On TDP Leaders- police

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఘోర అవమానం జరిగింది. గన్నవరం విమానాశ్రయంలోకి కన్నాను పోలీసులు అనుమతించలేదు. లిస్టులో పేరు లేదంటూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తాను గుంటూరు వెళ్లాలని.. చెప్పినా పోలీసులు అనుమతించలేదు.గన్నవరం విమానాశ్రయం నుంచి ప్ర‌ధాని నేరుగా హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన నేపథ్యంలో టీడీపీ మంత్రులు, నేతలు నల్ల దుస్తులు, మట్టికుండలు, నల్లటి జెండాలతో నిరసన తెలుపుతున్నారు.

2492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles