సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?

Tue,February 19, 2019 03:48 PM

AP BJP President Kanna LaxmiNarayana Fires On CM Chandrababu

ప్రకాశం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మొద్దు. నమ్మితే ఈ రాష్ర్టాన్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడని లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్ర పథకాల డబ్బులను చంద్రబాబు, ఆయన టీమ్ దోచుకుని తింటూ మోదీని విమర్శించడం దారుణమని మండిపడ్డారు. పోలవరానికి బస్సుల్లో ప్రజలను తరలిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఎందుకు పూర్తి చేయలేదు. బీసీ రైతు కోటయ్య మృతి ఘటనలో సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

కొండవీడు ఫెస్టివ‌ల్‌ కోసం కోటయ్యకు చెందిన పొలాన్ని తన సమ్మతి లేకుండా తీసుకునే హక్కు మీకు, పచ్చ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులకు ఎవరిచ్చారు?! సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? మీలాంటి దౌర్జన్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం' అని క‌న్నా ట్విట‌ర్‌లో విరుచుకుప‌డ్డారు.
1612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles