ఏపీ.. మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగింపు

Fri,May 24, 2019 03:33 PM

AP Ministers name plates remove at state secretariat

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సచివాలయంలో మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరిపాలన శాఖ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది మంత్రులు పేషీల్లో నేమ్ ప్లేట్స్ తొలగించారు. చంద్రబాబు ఫోటోలను కూడా తొలగించారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ వైసీపీ 151, టీడీపీ 23 స్థానాల్లో గెలిచాయి. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు స్వల్ప మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

1166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles