అరవింద్ కేజ్రివాల్ హోలీ త్రోబ్యాక్ ఫోటో.. ఐఐటీలో చదివినప్పటిది..!

Thu,March 21, 2019 04:37 PM

Arvind Kejriwal Holi Throwback Pic From IIT Days

ఇవాళ హోలీ. అందరూ హోలీని ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల దగ్గర్నుంచి సాధారణ ప్రజలు అందరూ రంగులు జల్లుకొని హ్యాపీగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. అయితే.. హోలీ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ హోలీ త్రోబ్యాక్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరవింద్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నప్పుడు హోలీ వేడుకల్లో పాల్గొన్న సమయంలో తీసిన ఫోటో అది. 1986లో తీసిన ఫోటో అది. తన బ్యాచ్‌మెట్ రాజీవ్ సరఫ్ హోలీ సంద‌ర్భంగా ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హోలీ వేడుకల్లో పాల్గొన్న గ్రూప్‌లో అరవింద్ కూడా ఉన్నారు. అయితే ఆ గ్రూప్‌లో సీఎం ఎక్కడున్నారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకొని ముందు నడుస్తున్న వ్యక్తినే నేను.. అంటూ అరవింద్ కేజ్రివాల్ రిప్లయి ఇచ్చారు. ఇక.. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయిందో లేదో నెటిజన్లు ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.

1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కేజ్రివాల్ బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1993లో ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఢిల్లీకి ఏడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 2015 నుంచి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు న్యూఢిల్లీలో ఇన్‌కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్‌గా పని చేసేవారు.


2324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles