డ్యాన్స్ చేసిన అస‌దుద్దీన్ ఓవైసీ.. వీడియో

Sat,October 19, 2019 10:12 AM

హైద‌రాబాద్‌: ఏఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ డ్యాన్స్‌ చేశారు. కొన్ని సెక‌న్ల పాటు త‌న బాడీని షేక్ చేసి అంద‌ర్నీ స్ట‌న్ చేశారు. మ‌హారాష్ట్ర‌లోని ఔరంగ‌బాద్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. వేదిక‌పై మాట్లాడిన త‌ర్వాత.. అక్క‌డ నుంచి వెనుదిరుగుతున్న స‌మ‌యంలో స్టేజ్ మెట్ల‌పై ఓవైసీ కొన్ని స్టెప్పులేశారు. ఎంఐఎం పార్టీ సింబ‌ల్ అయిన ప‌తంగిని గుర్తు చేసే విధంగా ఎంపీ ఓవైసీ స్టెప్పులేసిన‌ట్లు కొంద‌రంటున్నారు. ఓవైసీ డ్యాన్స్ వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ షేర్ చేసింది. మ‌హారాష్ట్ర‌లోని 288 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను, ఎంఐఎం పార్టీ 44 స్థానాల్లో పోటీ చేస్తున్నది.



3066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles