మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

Sat,October 19, 2019 05:34 PM

ఢిల్లీ/ముంబయి: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ 90,403 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసింది. 8,95,62,706 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


హర్యానా రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో 1,168 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ 19,425 పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. 1,82,98,714 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించారు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈనెల 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles