అదిరిపోయే లుక్‌తో ఆడి A4

Thu,September 8, 2016 02:49 PM

న్యూఢిల్లీ: ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ కంపెనీ ఆడి.. కొత్త పెట్రోల్ వ‌ర్ష‌న్ కారు A4ను గురువారం లాంచ్ చేసింది. 1.4 టీఎస్ఐ పెట్రోల్ మోటర్‌, 150 పీఎస్ ప‌వ‌ర్‌, 250 ఎన్ఎమ్ టార్క్‌తో ఈ కారును త‌యారుచేశారు. ఈ కారును 2008లోనే తొలిసారి లాంచ్ చేసినా.. తాజాగా ఎన్నో మార్పులు, చేర్పుల‌తో మ‌రోసారి క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ పెట్రోల్ వ‌ర్ష‌న్‌తో ల‌గ్జ‌రీ సెడాన్ మోడ‌ల్‌లో త‌న ప్ర‌త్య‌ర్థి మెర్సిడెజ్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని ఆడి భావిస్తోంది. డీజిల్ వ‌ర్ష‌న్‌ను కూడా తొంద‌ర్లోనే లాంచ్ చేయ‌నున్నారు. గ‌త మోడ‌ల్ కంటే ఈ కొత్త వ‌ర్ష‌న్ 95 కేజీల బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌టం విశేషం. ఈ ఏ4 కొత్త వ‌ర్ష‌న్ ధ‌ర‌లు రూ.38.1 లక్ష‌ల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

1541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles