గుడికెళ్లే నేత‌ల‌ను నిషేధించండి..

Tue,May 14, 2019 10:56 AM

హైద‌రాబాద్‌: రాజ‌కీయ నేత‌లు ఆల‌యాల‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవాలంటూ బీఎస్పీ చీఫ్ మాయావ‌తి ఇవాళ ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. లీడ‌ర్లు ఆల‌యాల‌కు వెళ్ల‌డం ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కింద‌కు వ‌స్తుంద‌ని ఆమె ఆరోపించారు. ఎన్నిక‌ల వేళ దేవాల‌యాల‌కు వెళ్లే నేత‌ల‌పై నిషేధం విధించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఇవాళ లక్నోలో మాయావ‌తి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో.. రోడ్‌షోలు నిర్వ‌హించ‌డం, గుడికి వెళ్ల‌డం ఫ్యాష‌న్‌గా మారింద‌ని బీఎస్పీ నేత ఆరోపించారు. ఇలాంటి వాటి కోసం అయ్యే ప్ర‌చార ఖ‌ర్చుపై ఈసీ దృష్టిపెట్టాల‌ని కోరారు. ఆ మొత్తాన్ని అభ్య‌ర్థి ప్ర‌చార ఖ‌ర్చు ఖాతాల్లోనే వేయాల‌న్నారు. రోడ్‌షోల‌ను, ఆల‌యాల సంద‌ర్శ‌న‌ను మీడియా క‌వ‌రేజ్ చేయ‌డం ఆపేయాల‌ని కూడా మాయా సూచించారు.

1193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles