భోపాల్‌ గ్యాస్‌ బాధితుల ఉద్యమ నేత జబ్బర్‌ ఇకలేరు

Fri,November 15, 2019 10:41 AM

భోపాల్‌ : భోపాల్‌ గ్యాస్‌ బాధితుల కోసం పోరాడిన సామాజిక కార్యకర్త అబ్దుల్‌ జబ్బర్‌ ఇకలేరు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జబ్బర్‌ గురువారం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1984, డిసెంబర్‌ 2-3 తేదీల్లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ యొక్క పురుగుల మందు ప్లాంట్‌ నుంచి మిథైల్‌ ఐసోసైనేట్‌ లీక్‌ కావడంతో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే 20 వేల కుటుంబాల బాధితులకు అండగా ఉంటూ.. వారికి న్యాయం జరగాలని అబ్డుల్‌ జబ్బర్‌ పోరాటం చేశాడు.


తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయాడు
భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో జబ్బర్‌ తన తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయాడు. తనకు కూడా 50 శాతం దృష్టి లోపం వచ్చింది. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ వ్యాధితో బాధ పడుతున్నాడు. అయినప్పటికీ బాధితుల తరపున జబ్బర్‌ ఉద్యమం చేశాడు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మహిళా ఉద్యోగ్‌ సంఘటన్‌ పేరిట సంస్థను ఏర్పాటు చేసి బాధితుల తరపున జబ్బర్‌ ఉద్యమించాడు. ఇప్పటికీ భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితులు అనారోగ్యానికి గురవుతున్నారు.

ప్రభుత్వం ఖర్చు భరిస్తామని చెప్పింది.. అంతలోపే
అయితే అబ్దుల్‌ జబ్బర్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న మద్యప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆయనకు వైద్యం అందించేందుకు ఖర్చు భరిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో జబ్బర్‌ను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు కూడా చేశారు. అంతలోపే ఆయన కన్నుమూశారు. జబ్బర్‌ మృతిపట్ల పలువురు నివాళులర్పించారు.

తప్పించుకున్న యూనియన్‌ కార్బైడ్‌ సీఈవో
ఈ దుర్ఘటన జరిగిన కొద్దిసేపటికే యూనియన్‌ కార్బైడ్‌ సీఈవో వారెన్‌ అండర్సన్‌ తప్పించుకున్నాడు. ఈ కేసులో కోర్టుకు కూడా అండర్సన్‌ హాజరు కాలేదు. అమెరికాకు చెందిన అండర్సన్‌ 2013లో యూఎస్‌లో మరణించాడు.

431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles