గుడ్ల వివాదం.. మహారాష్ట్రలో లేనిది మధ్యప్రదేశ్‌కు ఎందుకు?

Fri,November 8, 2019 12:12 PM

భోపాల్‌ : మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా కోడిగుడ్లను పిల్లలకు ఇస్తున్న విషయం విదితమే. అయితే ఈ కోడిగుడ్ల విషయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య వివాదం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు కోడిగుడ్డు ఇవ్వొద్దని మధ్యప్రదేశ్‌ బీజేపీ నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. అయితే ఈ అంశంపై మధ్యప్రదేశ్‌ మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి ఇమార్తి దేవీ స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్భవించిన మహారాష్ట్రలో విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేస్తే లేని ఇబ్బంది.. మధ్యప్రదేశ్‌లో విద్యార్థులకు కోడిగుడ్లు ఇస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కోడిగుడ్లు ఇస్తున్నామని మహారాష్ట్ర అధికారులు తమకు చెప్పారని మంత్రి తెలిపారు. పిల్లలకు ఇస్తున్న ఆహారంపై బీజేపీ రాజకీయాలు చేయడం తగదన్నారు. కోడిగుడ్లు తినడం వల్ల విద్యార్థులకు మంచి పోషకాహారం లభిస్తుందన్న డాక్టర్ల సూచన మేరకే పాఠశాలల్లో కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతోంది.

1319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles