విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన ఉద్రిక్తం..వీడియో

Wed,September 11, 2019 06:52 PM

BJP workers marching towards CESC office over hike in electricity tariff


కోల్ కతా: పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీలు పెంచడంపై బీజేపీ నేతలు ఆందోళన బాట పట్టారు. ఛార్జీల పెంపుతోపాటు మీటర్ రీడింగ్ నమోదులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ..బీజేపీ నేతలు కోల్ కతా ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ (సీఈఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లు తోసుకుంటూ ఆఫీసులోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ కు సమీపంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనలో పలువురికి గాయాలవగా..వారిని ఆస్పత్రికి తరలించారు. కొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.


1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles