ఓటేసిన బాలీవుడ్ స్టార్లు..

Mon,April 29, 2019 10:58 AM

bollywood stars aamir khan and Madhuri Dixit cast their vote in mumbai

ముంబై: దేశ వ్యాప్తంగా నాలుగో విడుత లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు తప్పితే మిగితా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఓటేసి ఓటు విలువను తెలియజెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమిర్, ఆయన భార్య కిరణ్ బాంద్రాలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకోగా.. మాధురీ దీక్షిత్ తన ఓటు హక్కును జుహులో వినియోగించుకున్నారు. మరో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, సోనాలీ బెంద్రె విల్లె పార్లెలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు.919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles