ఆర్ఎస్ఎస్ వైఖ‌రిని ఖండించిన మాయావ‌తి

Mon,August 19, 2019 04:21 PM

BSP chief Mayawati asks RSS to renounce its anti-reservation mentality


హైద‌రాబాద్‌: రిజ‌ర్వేష‌న్ల వ్య‌తిరేక స్వ‌భావాన్ని ఆర్ఎస్ఎస్ విడ‌నాడాల‌ని బీఎస్పీ నేత మాయావ‌తి అన్నారు. రిజ‌ర్వేష‌న్లు ఉండాలా వ‌ద్దా అన్న అంశంపై సానుకూలంగా చ‌ర్చించుకోవాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఇటీవ‌ల అన్నారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌ను మాయా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై చ‌ర్చించాల‌ని ఆర్ఎస్ఎస్ అంటోందంటే.. ఇందులో ఏదో తిర‌కాసు ఉంద‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఆ చ‌ర్చ అవ‌స‌రం లేద‌ని మాయావ‌తి అన్నారు. రిజ‌ర్వేష‌న్లు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అని ఆమె తెలిపారు. ఆ హ‌క్కుల్ని కాల‌రాయ‌డం అన్యాయ‌మ‌వుతుంద‌న్నారు.

863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles