బస్సు డ్రైవర్‌ను దొంగ అనుకొని..

Tue,September 3, 2019 02:38 PM


మహారాష్ట్ర: ఓ డ్రైవర్‌ బస్సుకు సమీపంలో నిల్చుని ఉన్నాడు. అయితే కొంతమంది వ్యక్తులు ఆ డ్రైవర్‌ ను చూసి దొంగగా అనుమానించారు. అందరూ కలిసి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రంలోని పల్ఘర్‌ జిల్లాలో జరిగింది. బోయిసర్‌ ప్రాంతంలో ఉన్న బస్సు దగ్గర రన్‌జిత్‌ పాండే అనే వ్యక్తి నిల్చొని ఉన్నాడు. కొంతమంది రన్‌జిత్‌ పాండేను చూసి..అతడు బస్సు బ్యాటరీ, టైర్లు, సామాగ్రి చోరీ చేసేందుకు వచ్చినట్లుగా అనుమానించి దాడి చేశారు. ఈ ఘటనలో రన్‌జిత్‌ కు తీవ్రగాయాలవగా..అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే రన్‌జిత్‌ చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు.


ఈ ఘటనలో అన్వర్‌ గరేజ్‌వాలా, మింటుతోపాటు మరో నలుగురు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్‌ 302, 143, 149, 147 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు..విచారణ అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీస్‌ ఉన్నతాధికారి హేమంత్‌ కాట్కర్‌ తెలిపారు.

1555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles