దేశవ్యాప్తంగా పటాకుల నిషేధంపై నేడు సుప్రీం తీర్పు!

Tue,October 23, 2018 07:48 AM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పును వెలువరించనుంది. పటాకులను కాల్చడం ద్వారా వాయుకాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఆగస్టు 28న తీర్పును రిజర్వు చేసింది. రాజ్యాంగం అందించిన జీవించే హక్కు ఇరువురికి వర్తిస్తుందని, పటాకులపై నిషేధం విధించే విషయంలో ఈ రెండు అంశాలను సమంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
మీడియాపై చర్యలెందుకు తీసుకోలేదు?.. పీసీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
లైంగికదాడి బాధితుల గుర్తింపును బహిర్గతం చేస్తున్న మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధితుల వివరాల్ని వెల్లడించడంపై సోమవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలుచేయాలని పీసీఐ, న్యూస్‌బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ, ఎడిటర్స్‌గిల్డ్, ఇండియన్‌బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్‌లను ధర్మాసనం ఆదేశించింది.

1832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles