రూ.14 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్ట్

Thu,April 4, 2019 04:30 PM

CBI arrested IT Officer in Bengaluru


బెంగళూరు : బెంగళూరులో ఓ సంస్థకు చెందిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ఇన్‌ట్యాక్స్ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఐటీ అధికారి హెచ్‌ఆర్ నగేశ్ బెంగళూరులోని కోరమంగళలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ సంస్థలో పెండింగ్‌లో ఉన్న పన్నులకు సంబంధించిన సెటిల్‌మెంట్ కోసం లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. సదరు వ్యక్తి ఆఫీస్‌లో ఇన్‌ట్యాక్స్ సర్వేకు సంబంధించిన విషయంలో..హెచ్‌ఆర్ నగేశ్ అతన్ని రూ.14 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధిత వ్యక్తి ఈ విషయాన్ని ఏసీబీ అధికారులను చేరవేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా హెచ్‌ఆర్ నగేశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ మరో ఐటీ అధికారిపై కూడా కేసులు నమోదు చేసింది. తాము చేపట్టిన తనిఖీల్ల్లో రూ.1.35 కోట్ల నగదుతోపాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు.

2636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles