చిదంబరానికి ఆగస్టు 26 వరకు కస్టడీ

Thu,August 22, 2019 07:03 PM

CBI Court sends P Chidambaram to CBI custody till August 26


న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీ విధించింది. 3 గంటల విచారణ తర్వాత సీబీఐ చిదంబరంను కోర్టులో హాజరుపర్చింది. చిదంబరాన్ని 5 రోజులు కస్టడీకి అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు కోర్టు చిదంబరాన్ని కస్టడీకి అనుమతించింది. కుటుంబ సభ్యులు, లాయర్లు రోజూ చిదంబరంను కలవచ్చని ఈ సందర్భంగా కోర్టు వెల్లడించింది. చిదంబరాన్ని కలిసి మాట్లాడేందుకు ప్రతీ రోజు 30 నిమిషాలు సమయం ఇస్తున్నట్లు తెలిపింది.

సీబీఐ అధికారులు చిదంబరంను బుధవారం రాత్రి ఢిల్లీలోని జోర్‌బాగ్‌లో ఉన్న ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. చిదంబరం అరెస్టుకు ముందు బుధవారం సుప్రీంకోర్టులో, ఆయన ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

1362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles