లంచం తీసుకున్న సైన్యాధికారులు.. కేసు నమోదు

Thu,January 3, 2019 07:58 AM

CBI file case on army officers in bribe

న్యూఢిల్లీ: ఐదుగురు సైన్యాధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు అవసరమైన సరుకుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, ఈ ఐదుగురు కలిసి సరుకులను సరఫరా చేసే కాంట్రాక్టరు(సప్లయర్) నుంచి రూ.18 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆర్మీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో కల్నాల్ రమణ్ దాదా, లెఫ్టినెంట్ కల్నాల్ మహేందర్ కుమార్, సుబేదార్లు దేవేంద్రకుమార్, సహురన్ సాహూ, హవల్దార్ అభయ్ సింగ్, సప్లయర్ కేకే యాంగ్‌ఫొలపై సీబీఐ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. కల్నాల్ రమణ్‌దాదా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, సప్లయర్ యాంగ్‌ఫొ నుంచి రెండు విడుతలుగా రూ.4.15 లక్షలు స్వీకరించాడని సైన్యం ఆరోపించింది. సరుకుల నాణ్యతను పరిశీలించాల్సిన మహేందర్‌కుమార్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి సప్లయర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకున్నాడని తెలిపింది. దేవేంద్రకుమార్ రూ.2.04 లక్షలు, అభయ్‌సింగ్ రూ.98వేలు, సహురన్ సాహూ రూ.7.65 లక్షలు లంచంగా స్వీకరించారని సైన్యం ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ప్రాథమిక దర్యాప్తు జరిపిన సీబీఐ అవకతవకలు జరిగినట్లు గుర్తించి కేసు నమోదు చేసింది.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles