యాసిన్ మాలిక్ సంస్థ‌పై నిషేధం.. గిలానీపై 14 ల‌క్ష‌ల జ‌రిమానా

Fri,March 22, 2019 06:55 PM

Centre bans Yasin Malik led JKLF, Gilani fined 14.40 lakhs by ED

హైద‌రాబాద్: యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జ‌మ్మూక‌శ్మీర్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ సంస్థ‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించింది. శుక్ర‌వార‌మే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో జ‌రిగిన క్యాబినెట్ క‌మిటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన యాసిన్ మాలిక్‌ను అరెస్టు చేశారు. పుల్వాదా దాడి త‌ర్వాత అత‌న్ని అరెస్టు చేశారు. ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్ర‌కారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత జ‌మ్మూలోని బ‌ల్వాల్ జైలుకు అత‌న్ని త‌ర‌లించారు.

మరోవైపు వేర్పాటువాద నేత స‌య్యిద్ అలీ షా గిలానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ జ‌రిమానా విధించింది. ఫెమా చ‌ట్టాన్ని ఉల్లంఘించిన కేసులో అత‌నిపై సుమారు 14.40 ల‌క్ష‌ల జ‌రిమానా వేసింది. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో జిలాని సుమారు ప‌దివేల డాల‌ర్లు క‌లిగి ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

1436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles