తాను కట్టించిన జైలు గదిలోనే బంధీగా ఛగన్ భుజ్‌బల్

Wed,April 6, 2016 04:27 PM

ముంబై: ఒకప్పుడు మంత్రి. ఎన్సీపీ సీనియర్ నేత. ఇవాళ ఓ జైలు గదిలో బంధీ. ఇది మహారాష్ట్ర ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ దుస్థితి. యాధృచ్చికమో ఏమో తెలియదుగానీ తాను కట్టించిన జైలులోనే ఇవాళ ఛగన్ భుజ్ బల్ బంధీగా ఉన్నారు. ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడినపుడు ఛగన్ భుజ్‌బల్ ఆర్ధర్‌రోడ్డు జైలులో కసబ్ కోసం ప్రత్యేక గదిని తాను దగ్గరుండి కట్టించారు. దీనికి బ్యారాక్-12 అని పేరు కూడా పెట్టారు. మహారాష్ట్ర సదన్ కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసులో నిందితునిగా ఇవాళ అదే బ్యారాక్-12లో ఉంటున్నారు. కేసు విచారణలో ఉంది.


అయితే ఇదే గదిలో షీనా బోరా హత్యకేసులో నిందితుడు పీటర్ ముఖర్జియా ఉంటున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు కూడా ధృవీకరించారు. ఇరువురిని బ్యారాక్ నెంబర్ 12లో ఉంచామని పేర్కొన్నారు. పీటర్ ముఖర్జియాకు ఇంటి నుంచి వస్తోన్న భోజనాన్ని ఛగన్‌భుజ్‌బల్‌తో కలిసి పంచుకుంటున్నారు. పీటర్ ముఖర్జియాకు ఇంటి నుంచి ఆహారం తెచ్చి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. కసబ్‌ను ఎరవాడ జైలుకు తరలించిన తర్వాత ఈ సెల్‌ను విభజించి జైలుకు వచ్చిన ప్రముఖుల కోసం వినియోగిస్తున్నారు.

1386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles