చిదంబరం టీ, ఓట్స్‌ మాత్రమే తీసుకున్నారట..

Fri,September 6, 2019 01:24 PM

Chidambaram In Tihar Jail Starts Day With A Light Breakfast

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీలోని సీబీఐ కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను తీహార్‌ జైలుకు నిన్న సాయంత్రం తరలించారు. నిన్న రాత్రి చిదంబరం రొట్టె, మెంతి కూరతో చేసిన పప్పు, కూరగాయాలతో డిన్నర్‌ చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం మాత్రం ఆయన కేవలం టీ, ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకున్నారట. ఇవాళ ఉదయం ఆయన కాసేపు వాకింగ్‌ చేశారని సమాచారం. మిగతా ఖైదీలకు వడ్డించిన భోజనాన్నే చిదంబరానికి కూడా వడ్డిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

కొడుకు గడిపిన సెల్‌లోనే
చిదంబరానికి తీహార్ జైలులోని 7వ నంబర్ సెల్‌ను కేటాయించారు. ఈడీ కేసుల్లో అరెస్టయిన వారిని ఇక్కడ ఉంచుతారు. గతంలో ఇదే కేసులో కార్తీ అరెస్టయినప్పుడు 7వ సెల్‌లోనే 12 రోజులు గడిపారు.కోర్టు ఆదేశాల మేరకు చిదంబరానికి ప్రత్యేకంగా ఒక గది, వెస్ట్రన్ టాయిలెట్ కేటాయించామని, అంతకుమించి ఎలాంటి సదుపాయాలు లేవని అధికారులు తెలిపారు.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles