ఈ పిల్లాడి టాలెంట్ చూడండి.. ఖాళీ సిరంజీలతో జేసీబీని తయారు చేశాడు..!

Fri,May 17, 2019 12:58 PM

child developed JCB with empty syringes video goes viral

టాలెంట్ అనేది ఎవరి సొత్తూ కాదు.. అనే మాట నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. పిల్లోడు అయినా.. పెద్దోడు అయినా.. పండు ముసలి అయినా..మెదడుకు పదును పెట్టాలే కానీ.. రాని ఆలోచనలంటూ ఉండవు. మెదడుకు పదును పెట్టినంత మాత్రాన ఏం లాభం. మెదడులో పుట్టిన ఆలోచనను కార్యరూపం దాల్చేలా చేయాలి. అప్పుడే ఆ ఆలోచనకు ఓ రూపం వస్తుంది. ఆ ఆలోచన వర్కవుట్ అవుతుంది. ఈ పిల్లాడు అదే చేశాడు. తనకు వచ్చిన ఆలోచనను వెంటనే ఇంప్లిమెంట్ చేశాడు. ఫలితం చూడండి.. ఖాళీ సిరంజీలతో బుల్లి జేసీబీని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు. మనోడి బుల్లి జేసీబీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


4778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles