పుణ్యస్నానమాచరించిన యూపీ సీఎం యోగి.. వీడియో

Tue,January 29, 2019 04:58 PM

CM Yogi Adityanath and other leaders take holy dip at KumbhaMela 2019

లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు మంత్రులు, ఇతర నాయకులు కుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు. ఇవాళ ఉదయం ప్రయాగరాజ్ చేరుకున్న సీఎం యోగి.. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎంతో పాటు మంత్రులు కుంభమేళాకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. యూపీ సీఎంగా యోగి పగ్గాలు చేపట్టిన తర్వాత లక్నో వెలుపల కేబినెట్ సమావేశం జరగడం ఇదే తొలిసారి. జనవరి 15న ప్రారంభమైన ఈ కుంభమేళా మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది.1498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles