కోడిగుడ్లు పెట్టిన నాగు పాము.. వీడియో

Sat,April 14, 2018 12:05 PM

పాము.. పాము గుడ్లు పెడుతుంది కాని.. కోడి గుడ్లు పెట్టడమేందని విస్తుపోకండి. ఎందుకంటే.. ఆ పాము కోడిగుడ్లను లపాలపా మింగేసి.. వాటిని అరిగించుకోలేక అవస్థలు పడి తిరిగి ఆ గుడ్లను కక్కేసింది. అవును.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏనిమిది గుడ్లను మింగేసిన నాగు పాము వాటిని అరిగించుకోలేక ఏడు గుడ్లను బయటికి వెల్లదీసింది. ఈ ఘటన కేరళలోని వాయానాడ్‌లో చోటు చేసుకున్నది. వివరాళ్లోకెళ్తే...


గుడ్లు పొదిగిన కోడి ఉన్న గూట్లోకి ఓ నాగు పాము జొర్రబడింది. వెంటనే ఆ కోడిని తన కాటుతో చంపేసింది. అనంతరం ఏంచక్కా ఆ కోడి పొదిగిన గుడ్లను టకటకా మింగేసింది. ఇక.. కోడి గూట్లో ఉన్న నాగు పామును గమనించిన ఆ ఇంటి సభ్యులు.. వెంటనే పాములు పట్టే వ్యక్తి సుజిత్‌కు కబురు పంపారు. వెంటనే రంగంలోకి దిగిన సుజిత్.. గుడ్లు మింగిన తర్వాత కోళ్ల గూటిలో దాక్కొని ఉన్న పామును పట్టుకొని బయట పడేశాడు. వెంటనే ఆ పాము తాను మింగిన గుడ్లను ఒకదాని వెనక మరోటి వెల్లగక్కింది. మొత్తం ఏడు గుడ్లను బయటికి తీసిన అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కాని.. దాన్ని చాకచక్యంగా పట్టుకొని బస్తాలో బంధించి తీసుకెళ్లి దగ్గర్లో ఉన్న బెగుర్ ఫారెస్ట్‌లో వదిలేశాడు.

ఇక.. ఈ పాము గుడ్లను వెల్లగక్కతుండగా వీడియో తీసిన సుజిత్ దాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ గుడ్లను కక్కిన పాముపై తెగ కామెంట్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

9068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles