బడ్జెట్‌ 2019 : ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!

Fri,July 5, 2019 04:38 PM

Complete List of What Will Get Cheaper and Dearer

న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, వెండి ధరలు భారీగా పెరుగనున్నాయి. మ‌రికొన్ని వ‌స్తువుల‌పై ప‌న్నులు పెంచ‌డంతో వాటి ధ‌ర‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. ముఖ్యంగా డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1 పెంపుతో పాటు బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.50 శాతానికి పెంచుతున్నట్లు బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. సుంకాలు పెంచడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ధరలు పెరిగే, తగ్గే వస్తువుల‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం..!


ధరలు తగ్గేవి..!

నాఫ్తా
గృహ రుణాలు
రక్షణ సామగ్రి
రిఫ్రిజిరేటెడ్ హీలియం లిక్విడ్
సిలికా రాడ్లు, ట్యూబులు
టెక్స్‌టైల్
ఉన్ని వస్తువులు
స్టీల్
మొబైల్ ఫోన్ల కెమెరాలు
మొబైల్ ఫోన్ల ఛార్జర్లు
లిథియమ్ అయాన్ బ్యాటరీలు
సెట్‌టాప్ బాక్స్
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు

ధరలు పెరిగేవి..!

బంగారం
జీడిపప్పు
రసాయనాలు
ప్లాస్టిక్, పీవీసీ పైపులు
రబ్బర్
ప్లాస్టిక్స్ ఫ్లోర్ కవర్లు
న్యూస్‌ప్రింట్
ప్రింటెడ్ బుక్స్
సెరామిక్ ఉత్పత్తులు
సెరామిక్ రూఫింగ్ టైల్స్
స్టీల్, మెటల్ ఉత్పత్తులు
స్టెయిన్‌లెస్ ఉత్పత్తులు
లౌడ్‌స్పీకర్లు
ఏసీలు
సీసీటీవీ కెమెరా
ఆప్టికల్ ఫైబర్
గ్లాస్ అద్దాలు
దిగుమతి చేసుకునే పుస్తకాలు
మ్యాగజైన్లు
వాహనాల లైట్లు
సిగరెట్లు
హుక్కా, గుట్కా, జర్దా ఉత్పత్తులు
పెట్రోలియం ఉత్పత్తులు
పెట్రోల్
డీజిల్

23271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles