ఆ మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు పరాభవం!

Sun,May 19, 2019 10:06 PM

Congress Crash In Heartland States It Won In December Predict Exit Polls

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఆరు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఈ మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ చతికిలపడిపోయినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మూడు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించుకోలేక పోతుందని ఆయా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మూడు రాష్ర్టాల్లో 65 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇందులో కేవలం 13 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలుండగా.. కాంగ్రెస్ 4, బీజేపీ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని దాదాపు 10 సర్వేలు వెల్లడించాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ 3, బీజేపీ 22, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 6, బీజేపీ 23 స్థానాల్లో గెలవనున్నట్లు సర్వేలు అంచనా వేశాయి. ఇక ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ముందు వరుసలో లేదు. భారతీయ జనతా పార్టీనే అన్ని రాష్ర్టాల్లోనూ ముందు వరుసలో ఉంది.

3134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles