మోదీపై మ‌ళ్లీ అజ‌య్ రాయ్ పోటీ

Thu,April 25, 2019 12:40 PM

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అజ‌య్ రాయ్ పోటీ చేయ‌నున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. 2014లోనూ మోదీపై అజ‌య్ రాయ్ పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. నిజానికి ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ సోద‌రి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తార‌ని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ టెన్ష‌న్‌కు కాంగ్రెస్ నేత‌లు తెర‌దించారు. ప్ర‌స్తుతం ఈస్ట్ యూపీ ప్ర‌చార బాధ్య‌త‌లను ప్రియాంకా నిర్వ‌ర్తిస్తున్న‌ది. ఇవాళ మోదీ వార‌ణాసిలో రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత సాయంత్రం గంగా హార‌తిలో పాల్గోనున్నారు.

1032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles