హార్దిక్‌పటేల్ చెంప చెల్లుమనిపించిన వ్యక్తి

Fri,April 19, 2019 11:35 AM

Congress leader Hardik Patel slapped during a public rally in Gujarat

గాంధీనగర్: కాంగ్రెస్ నేత హార్దిక్‌పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సురేందర్‌నగర్‌లో హార్దిక్‌పటేల్ నేడు పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హార్దిక్ పాల్గొని మాట్లాడుతుండగా ఓ వ్యక్తి స్టేజిపైకి వచ్చి హార్దిక పటేల్ చెంప చెల్లుమనిపించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన హార్దిక్ తేరుకుని ప్రశ్నిస్తుండగా మిగతా కార్యకర్తలు వచ్చి దాడి చేసిన వ్యక్తిని చితకబాదారు. నిన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. గురువారం ఆయన ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తిభార్గవ ఆయన పైకి బూటు విసిరాడు.2019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles