కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాసేపు క్రికెట్ ఆడారు. శుక్రవారం హర్యానకు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ.. రివారీలో క్రికెట్ ఆడుతూ హుషారుగా కనిపించారు. క్రికెట్ ఆడి ఎన్నికల ప్రచారం నుంచి కాసేపు ఆయన ఉపశమనం పొందారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం మహేంద్రగర్ నుంచి ఢిల్లీకి రాహుల్ పయనమయ్యారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన వెళ్తున్న చాపర్ అత్యవసరంగా రివారీలోని కేఎల్పీ కాలేజీ మైదానంలో ల్యాండ్ అయింది. దీంతో అక్కడ క్రికెట్ ఆడుతున్న యువకులతో కలిసి రాహుల్ కూడా బ్యాట్ పట్టారు.