కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మండిపాటు

Tue,August 27, 2019 02:47 PM

బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిన తర్వాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 20 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. అయితే నిన్న(సోమవారం, 26)న జరిగిన సమావేశంలో ప్రభుత్వం ముగ్గుర్ని ఉప ముఖ్యమంత్రులుగా నియమించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇవాన్ డిసౌజా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఈ ప్రభుత్వ పోకడలు ఏ విధంగానూ నచ్చడం లేదు. కర్ణాటక చరిత్రలో మొట ్టమొదటిసారి ఇంత మంది డిప్యూటీ సీఎంలు ఎందుకు. రాష్ర్టాన్ని బీజేపీ పాలించడం లేదనీ, నాగ్పూర్ కేంద్రంగా ఆర్‌ఎస్సెస్ పరిపాలిస్తుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. వారి సూచనల మేరకే ఈ నిర్ణయం జరిగి ఉంటుందని ఆయన అన్నారు.


డిప్యూటీ సీఎంలుగా గోవింద్ మక్తప్ప కరజోల్, అశ్వత్ నారాయణ్, లక్ష్మణ్ సంగప్ప సవాది నియమితులయ్యారు. వీరిలో లక్ష్మణ్ సవాది ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అయినా అతడ్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. మాజీ సీఎం అయిన జగదీశ్ షెట్టార్‌ను సాధారణ మంత్రిని చేసి అతడి కన్నా జూనియర్స్‌ని మాత్రం డిప్యూటీ సీఎంలు చేయడమేంటనీ, జగదీశ్‌కు ఆత్మగౌరవం ఉంటే, నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలన్నారు.

647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles