బీజేపీని ఓడించేందుకు మా బలం సరిపోతోంది

Mon,March 18, 2019 12:25 PM

లక్నో : 17వ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు మా బలం సరిపోతోందని బీఎస్పీ చీఫ్‌ మాయావతి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) - బీఎస్పీ పొత్తు బలంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ యూపీలో మొత్తం 80 స్థానాల్లో పోటీ చేసుకోవచ్చు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కోసం 7 స్థానాలు వదిలేశామని చెప్పి ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్లొద్దని మాయావతి సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ యూపీలో 7 స్థానాల్లో పోటీ చేయదని ఆ పార్టీ నిన్న ప్రకటించింది. మెయిన్‌పూరి(ములాయం), కన్నౌజ్‌(డింపుల్‌ యాదవ్‌), ఆర్‌ఎల్డీ నాయకులు అజిత్‌ సింగ్‌, జయంత్‌ చౌదరితో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ చేసే స్థానాల్లో తాము పోటీ చేయబోమని కాంగ్రెస్‌ పార్టీ నిన్న వెల్లడించింది. పొత్తులో భాగంగా బీఎస్పీ 38, ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమేథి, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయరని మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ కలిసి సంయుక్తంగా ప్రకటించిన విషయం విదితమే.

2337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles