జేసుదాసు అయ్యప్ప పాటపై వివాదం!

Thu,November 23, 2017 08:02 AM

Controversy over yesudas Ayyappa song

తిరువనంతపురం: హరివరాసనం విశ్వమోహనం.. హరిదదీశ్వరం ఆరాధ్యపాదుకం.. అరి విమర్దనం నిత్యనర్తనం .. హరిహరాత్మజం దేవమాశ్రయే.. ఈ పాట విన్నవారి మనసు పులకించక మానదు. అందులోనూ జేసుదాసు గాత్రం నుంచి ఈ పాట జాలువారుతుంటే ఆ మాధుర్యమే వేరు. విన్నవారు తన్మయులవుతారు. దాదాపు యాభై ఏండ్లుగా శ్రోతలను అలరిస్తున్న ఈ పాటే.. శబరిమలేశునికీ జోలపాడుతున్నది. భక్త జనహృదయాల్లో నిలిచిపోయిన ఈ పాటను మార్చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) అంటున్నది. కోట్ల మందికి నచ్చిన ఈ పాటను ఇప్పుడు మార్చడమేమిటి అని సంగీతాభిమానులు, అయ్యప్ప భక్తులు.. ముఖ్యంగా ఈ పాటకు సంగీతం సమకూర్చిన ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ దేవరాజన్ శిష్యులు ఆగ్రహిస్తున్నారు. 1920లో మలయాళ సంస్కృతభాషల కలగలుపుగా రచించిన ఈ పాట 1970లో స్వామి అయ్యప్ప సినిమాలో ఉన్న గీతాల్లో ఒకటిగా శబరిమలలోని అయ్యప్పసన్నిధిలో 45 ఏండ్లుగా స్వామివారి శయనసేవ సందర్భంగా వినిపించడం సంప్రదాయమైంది.

ఈ పాటలో తప్పులున్నందున దీనిని మార్చేస్తామని.. పాట మూలప్రతిలో ఉన్న కొన్ని పదాలు, ప్రతిపాదంలో ఉండాల్సిన స్వామి అనే పదం జేసుదాసు పాడిన రికార్డులో లేవని బోర్డు నూతన అధ్యక్షుడు టీ పద్మకుమార్ ఇటీవల తెలిపారు. హరివరాసనం అనే పదాన్ని సరిగా ఉచ్చరించలేదని చెప్పారు. విస్మరించిన పదాలను చేర్చి.. మళ్లీ జేసుదాసుతోనే పాడించి కొత్తగా రికార్డు చేయిస్తామని ఆయన ఇటీవల చెప్పారు. ఇన్నేండ్లుగా లేని అభ్యంతరం వెనుక ఏదో కుట్ర ఉన్నదని దేవరాజన్ మెమోరియల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు అనుమానిస్తున్నారు.

3922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles