చంద్రుడి ద‌క్షిణ ద్రువ‌మే ఎందుకు.. ఇదీ ఇస్రో వివ‌ర‌ణ

Tue,August 20, 2019 01:03 PM

Countries are racing to Moons South Pole, ISRO tweets its explanation

హైద‌రాబాద్‌: చంద్రుడి మీదే అంద‌రు దృష్టి పెట్టారు. చంద్ర‌యాన్‌2కు చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌.. వ‌చ్చే నెల‌లో చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై దిగ‌నున్న‌ది. వివిధ దేశాలు, స్పేస్ సంస్థ‌లు ఎందుకు చంద్రుడి ద‌క్షిణ ద్రువాన్ని టార్గెట్ చేశాయ‌న్న అంశాన్ని ఇస్రో వివ‌రించింది. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేసింది. చంద్రుడి ద‌క్షిణ ద్రువంలో ఉన్న అనేక అగాధాలు వేల కోట్ల ఏళ్ల నుంచి సూర్యుడి కాంతిని నోచుకోలేదు. ఈ కార‌ణంగా అక్క‌డ సౌర వ్య‌వ‌స్థ ఆవిర్భావానికి చెందిన అనేక విశ్వ ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణ ద్రువంపై ఉన్న లోయ‌ల్లో కొన్ని వంద‌ల మిలియ‌న్ల ట‌న్నుల నీరు ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. జీవాధారానికి నీరే ప్ర‌దానం కాబ‌ట్టి.. ఈ కోణంలోనూ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ద‌క్షిణ ద్రువంపై ఉన్న రాళ్ల‌లో అనేక ఖ‌నిజాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. హైడ్రోజ‌న్‌, అమోనియా, మీథేన్‌, సోడియం, మెర్క్యూరీ, సిల్వ‌ర్ లాంటి విలువైన ఖ‌నిజాలు ఉన్న‌ట్లు గుర్తిస్తున్నారు. భ‌విష్య‌త్తు ప్ర‌యోగాలు, రోద‌సి అన్వేష‌ణ‌ల కోసం చంద్రుడి ద‌క్షిణ ద్రువం అనువైన ప్రాంత‌మ‌ని ఇస్రో భావిస్తున్న‌ది.

3279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles