ముందే పేలిన ప‌టాకులు.. సుప్రీం ఆదేశం బేఖాత‌ర్

Wed,November 7, 2018 07:23 PM


హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పండ‌గే ప్ర‌జ‌ల‌కు ముఖ్యం. దీపావ‌ళి పూజ‌లు కాగానే.. ప్ర‌జ‌లు సంతోషంగా ప‌టాకులు పేల్చారు. బాణాసంచాకు ప‌నిపెట్టారు. తాజ‌గా సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం.. ప్ర‌జ‌లంద‌రూ దీపావ‌ళి రోజున రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌టాకులు కాల్చాలి. కానీ ఆ ఆర్డ‌ర్‌కు గౌర‌వం ద‌క్క‌లేదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌లు.. పూజ‌లు పూర్తి కాగానే ప‌టాకులు కాలుస్తూ క‌నిపించారు. కొన్ని చోట్ల ఉద‌యం నుంచే బాంబుల శ‌బ్ధాలు వినిపించాయి. కొన్ని చోట్ల సాయంత్రం చీక‌టి ప‌డ‌గానే.. ట‌పాకుల సంద‌డి మొద‌లైంది.

బాంబుల మోతలు ప్ర‌తి ఊళ్లోనూ మోగుతున్నాయి. బాణాసంచా కాల్చేందుకు టైమ్‌లైన్ ఉన్నా.. ఆ నిబంధ‌న‌ను ఎవ‌రూ పాటించ‌లేదు. కాలుష్యాన్ని నియంత్రించాల‌న్న ఉద్దేశంతో సుప్రీం ప్ర‌త్యేకమైన తీర్పును వెలువ‌రించినా.. ఆ తీర్పును పాటించే సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గా ఎదుర‌య్యాయి. ఉత్త‌రాది, ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు అనేక ప్రాంతాల్లోనూ ప్ర‌జ‌లు దీపావ‌ళి వేడుక‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. తారాజువ్వ‌లు, చిచ్చుబుడ్లు, తౌజెండ్‌వాలా, హండ్రెడ్‌వాలా, ల‌క్ష్మీబాంబ్‌.. మార్కెట్లో ఉన్న వెరైటీ ప‌టాకుల‌న్నీ కాల్చేశారు. రాత్రి 8 కాక‌ముందే ఆకాశం అంతా క్రాక‌ర్స్‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. దీప‌కాంతుల మ‌ధ్య ప‌టాకుల శ‌బ్ధాలు మారుమోగాయి. మ‌రి సుప్రీం.. త‌న‌ దీపావ‌ళి తీర్పును స‌మీక్షిస్తాందా లేదా వేచి చూడాల్సిందే.

9301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles