కమల్‌హాసన్‌పై క్రిమినల్‌ కేసు

Tue,May 14, 2019 04:46 PM

criminal complaint has been filed against Kamal hasan


న్యూఢిల్లీ: సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. స్వతంత్రభారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది నాథూరాం గాడ్సే అని కమల్‌హాసన్‌ తమిళనాడులో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హిందూమతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని..కమల్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ మంగళవారం కోర్టును ఆశ్రయించారు. అశ్విని ఉపాధ్యాయ ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టులో కమల్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది.

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ కమల్ హాసన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ మైనార్టీ ఓట్లు రాబట్టుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు చేసిన కమల్ నాలుక కత్తిరించాలని రాజేంద్ర బాలాజీ డిమాండ్ చేశారు. మరోవైపు కమల్ వ్యాఖ్యలను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా ఖండించాడు. ముస్లింల ఓట్ల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ? అని కమల్ హాసన్ ను వివేక్ ఒబెరాయ్ ప్రశ్నించాడు.

1650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles