పావురాన్ని కాపాడిన జవాన్.. ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం.. వీడియో

Sat,May 25, 2019 03:48 PM

CRPF jawan rescues injured bird video goes viral

జవాన్లు.. ఈ దేశాన్ని మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న పక్షులను కూడా కాపాడుతారు అని నిరూపించాడు ఈ జవాన్. ప్రతి జీవితం విలువైనదే. మనిషైనా.. పక్షి అయినా.. ఎవరైనా సరే. అందుకే.. గాయాలతో బాల్కనీలో చిక్కుకుపోయిన ఓ పావురాన్ని జవాన్ కాపాడాడు. నిచ్చెన వేసుకొని చిక్కుకొని ఉన్న పావురాన్ని ఆ జవాన్ రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోను జమ్ముకశ్మీర్‌లో పనిచేస్తున్న సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ కశ్యప్ కడగట్టూర్ షేర్ చేశాడు. ఆ పావురాన్ని రక్షించింది మాత్రం సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్. ఇక.. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఆ జవాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


2556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles