పసిబిడ్డను చూడకుండానే వీరమరణం పొందిన జవాన్‌

Fri,February 15, 2019 03:51 PM

CRPF Jawan Rohitash Lamba dies without seeing his 2 months daughter

తన రెండు నెలల పసి పాపను చూడకుండానే ఓ జవాన్‌ పుల్వామా ఉగ్రదాడి ఘటనలో వీరమరణం పొందారు. రాజస్థాన్‌లోని గోవింద్‌పురాకు చెందిన రోహితష్‌ లంబా(27)కు సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా సేవలందిస్తున్నారు. 25 ఏళ్ల వయసులో రోహితష్‌కు సీఆర్పీఎఫ్‌లో ఉద్యోగం రాగా, ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్‌లో రోహితష్‌ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. త్వరలోనే తన బిడ్డను చూసేందుకు ఉద్యోగానికి సెలవు పెట్టి గోవింద్‌పురాకు రావాలనుకున్న రోహితష్‌.. నిన్న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. భర్త రాక కోసం ఎదురుచూస్తున్న భార్య.. ఆయన మరణవార్త వినాల్సి వచ్చింది. రోహితష్‌ వీరమరణంతో.. గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

2582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles