సమాధి తవ్వలేదని.. దళితులను రాడ్లతో కొట్టారు..

Thu,September 12, 2019 03:18 PM

Dalits dragged out of their homes thrashed with iron rods for refusing to dig grave

'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడూ..' అని సినీగేయ రచయిత ఊరికే అనలేదు. ప్రస్తుత సమాజంలో మనుషులు కోల్పోతున్న నైతిక విలువలకు, మనుషుల్లో పెరుగుతున్న క్రూరత్వాన్ని ఎత్తిచూపుతున్న ఈ పాటకు అచ్చంగా అద్దం పట్టేలా ఓ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని నీలమంగళ గ్రామంలో సెప్టెంబర్ 8న చోటు చేసుకుంది.

ఆ గ్రామంలోని ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని సమాధి చేసేందుకు గుంత తవ్వాలని గ్రామంలోని దళితులను అగ్రకులస్తులు ఆదేశించారు. తాము గుంత తవ్వలేమని దళితులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహాంతో ఊగిపోయిన మృతుడి కుటుంబ సభ్యులు.. దళిత వాడలోకి ప్రవేశించారు. సుమారు 30 మంది.. దళితుల నివాసాల్లోకి వెళ్లి వారిని బయటకు లాక్కొచ్చారు. మహిళలనని చూడకుండా.. వారి వెంట్రుకలను పట్టుకొని.. ఈడ్చుకెళ్లి డ్రైనేజీలో తోసేశారు.

మగవాళ్లను అయితే ఇనుపరాడ్లతో దారుణంగా కొడుతూ.. వీధుల వెంబడి ఊరేగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్రకులస్తుల దాడిలో 9 మంది దళితులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles