‘డ్యాన్సింగ్ గర్ల్’ ట్రాఫిక్ విధులు..వీడియో వైరల్

Tue,November 19, 2019 04:51 PM


ఇండోర్: ‘మూన్‌వాకింగ్’ ట్రాఫిక్ పోలీస్ రంజిత్ సింగ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. అద్భుతమైన డ్యాన్స్‌తో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తూ ప్రశంసలందుకున్నాడు రంజిత్ సింగ్. ఇపుడు ఓ అమ్మాయి అతని బాటలోనే నడుస్తోంది. శుభి జైన్ అనే ఎంబీఏ విద్యార్థిని తనదైన ైస్టెల్‌లో డ్యాన్స్ చేస్తూ..ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తుంది. బైకుపై వెళ్తున్నవారికి హెల్మెట్లు ధరించాలని, కారులో వెళ్లేవారు సీటుబెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని తన డ్యాన్స్, హావభావాలతో చూపిస్తూ అవగాహన కల్పిస్తుంది.పూణేకు చెందిన శుభి జైన్ 15 రోజుల ఇంటర్న్‌షిప్ కోసం ఇండోర్‌కు వచ్చింది.


‘ట్రాఫిక్‌ను నియంత్రించడంలో నాకు అనుభవం లేదు. ఇండోర్ రాగానే కొంతమంది యువ వాలంటీర్లు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ విధులు నిర్వర్తించడం చూశా. నేను కూడా ట్రాఫిక్ ను చక్కబెట్టేందుకు రెడీ అయ్యానని’ మీడియాతో శుభి జైన్ చెప్పింది. ట్రాఫిక్ నియంత్రణ అంశంలో గత మూడేళ్లలో నిర్వహించిన నేషనల్ శానిటేషన్ సర్వేలో ఇండోర్ సిటీ టాప్‌లో ఉందని శుభి జైన్ తెలిపింది.

1653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles