అత్త పాడే మోసిన కోడళ్లు..

Wed,September 11, 2019 09:59 AM

Daughters in law break tradition carry mother in laws body for last rites in Maharashtra

ముంబయి : తమ బిడ్డల్లాగా చూసుకున్న అత్త పాడేను మోసి కోడళ్లు తమ రుణం తీర్చుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. సుందర్‌భాయి దగ్దు నైక్వాడే(83) అనే మహిళ సోమవారం కన్నుమూసింది. ఈమెకు నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనువళ్లు, మనుమరాండ్లు ఉన్నారు. అయితే తమ అత్త తమను బిడ్డల్లాగా చూసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని కోడళ్లు కన్నీరుమున్నీరు అయ్యారు. అత్త రుణం ఎలా తీర్చుకోవాలని కోడళ్లు ఆలోచించారు. అత్త పాడే మోసి ఆమె రుణం తీర్చుకోవాలనుకున్న కోడళ్లు నిర్ణయించారు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా అత్త పాడేను కోడళ్లు మోసి రుణం తీర్చుకుని.. అత్తా కోడళ్ల సంబంధానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. సుందర్‌భాయి కోరిక మేరకు ఆమె కళ్లను దానం చేశారు. సుందర్‌భాయి భర్త 2013లో మృతి చెందాడు. ఆయన కళ్లను కూడా నాడు దానం చేశారు.

3301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles