ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

Fri,August 16, 2019 01:01 PM

బెంగళూరు : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఓంకార్(38), నిఖిత(28) దంపతులకు ఐదేళ్ల బాలుడు ఉన్నాడు. అయితే ఓంకార్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ క్రమంలో తీవ్ర మానసిక వ్యధకు గురైన ఓంకార్.. తన భార్య, కుమారుడు, తల్లి వర్ష హేమ(55), బంధువు వర్ష భట్టాచార్య(30)ను మైసూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఈ ఐదుగురు తమకు తామే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అయితే అప్పుల వల్లే ఓంకార్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles