50 లక్షల కిలోల పటాకులు.. సుప్రీంను పట్టించుకోని ఢిల్లీ

Thu,November 8, 2018 04:04 PM

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పును ఏమాత్రం ఖాతరు చేయలేదు ఢిల్లీ ప్రజలు. కాలుష్యం పెరిగిపోతున్నదంటూ పటాకులు కాల్చడంపై కోర్టు కొన్ని ఆంక్షలు విధించినా.. ప్రజలు మాత్రం దీపావళిని ఓ రేంజ్‌లో జరుపుకున్నారు. సుమారు 50 లక్షల కిలోల పటాకులు కాల్చినట్లు రీసెర్చ్ గ్రూప్ అర్బన్ ఎమిషన్స్ వెల్లడించింది. దీనివల్ల పీఎం 2.5 ఉద్గారాలు లక్షా 50 వేల కేజీల వరకు ఉంటుందని ఆ గ్రూప్ అంచనా వేసింది. ఈ పీఎం 2.5 పార్టికల్స్ కంటికి కనిపించవు. ఇవి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయి. గతేడాది కూడా ఇలాగే సుప్రీంకోర్టు పటాకుల కాల్చడంపై ఆంక్షలు విధించినా.. ఢిల్లీ ప్రజలు పట్టించుకోలేదు.

ఢిల్లీ ఇప్పటికే గాలి కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. పరిమితి కంటే 66 రెట్లు ఎక్కువ మోతాదులో గాల్లో కాలుష్య కారకాలు ఉన్నాయి. సిస్టమ్ ఆఫ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 574గా ఉంది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి. మధ్యాహ్నమైనా కూడా ఢిల్లీ మొత్తం దట్టమైన పొగ ఆవరించి ఉంది. ఢిల్లీలో కేవలం హరిత పటాకులనే కాల్చాలని, అది కూడా రాత్రి 8 నుంచి పది గంటల వరకే కాల్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా.. ఆ ఆదేశాలను ప్రజలు ఉల్లంఘించారు. అలా ఉల్లంఘించిన వాళ్లను ఢిల్లీ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

1818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles