విమానాశ్రయంలోని క్యూ తప్పించుకోవడం కోసం..

Wed,November 20, 2019 07:07 AM

న్యూఢిల్లీ: పొడవైన 'క్యూ' ని, సెక్యూరిటీ చెకింగ్స్‌ను తప్పించుకోవడం కోసం ఓ వ్యక్తి పైలెట్ వేషధారణ వేశాడు. గుర్తించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిందితుడిని అరెస్ట్ చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడిచిన సోమవారం నాడు చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన రాజన్ మెహబూబాని(48) అనే వ్యక్తి ఎయిర్ ఏషియా విమానంలో కోల్‌కతా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. కాగా అక్కడి ప్రయాణికుల తాకిడిని, సెక్యూరిటీ చెకింగ్స్‌ను తప్పించుకుకునేందుకు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ పైలెట్‌గా వేషధారణ మార్చాడు. డిపార్చర్ గేట్ దాటుతుండగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కెప్టెన్ వేషధారణలో ఓ వ్యక్తి అనుమానంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన జర్మన్ ఎయిర్‌లైన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందజేశాడు. దీంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

2074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles